NTV Telugu Site icon

Jaggery Black Sesame: బెల్లాన్ని నువ్వులతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?

Nuvvula Laddu

Nuvvula Laddu

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న, పెద్ద వయసు సంబంధం లేకుండా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సహజసిద్ధంగా లభించే ఆహార పదార్ధాలను మనం తినే ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. నల్ల నువ్వులు అనేక రకములైన, ఆరోగ్య సమస్యలకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. మరి దీనిలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read : Benefits of Anjeer : ప్రతిరోజు అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయోజనాలు

నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసుకుని ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరం ఐరంన్‌, కాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వీటిని పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చాలా మందికి విటమిన్‌ బి, ఐరన్‌ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. ఇవి రెండు నల్ల నువ్వులులో పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని విటమిన్-ఈ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. నల్ల నువ్వులు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయట. వీటి వల్ల పీచు, లిగ్నల్‌లు వంటి పేగు క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి. నువ్వులలోని సెసెమిన్‌ కాలేయం దెబ్బ తినకుండా కాపాడుతుంది. నల్ల నువ్వుల్లో అధికంగా ఉండే పీచు అన్ సాచ్యురెటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారత వైద్యులు.
Also Read :Health Tips : రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. మీ ఆరోగ్యం భద్రం..!

వీటిల్లోని నూనె పేగు పొడి పారిపోకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా నానబెట్టి తీసుకోవడం వల్ల పేగులో నీళ్లు, పురుగులను బయటకి పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి. వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గించడమే కాకుండా.. కొలస్ట్రాల్‌ నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగా ఆడవారిలో 35 ఏళ్ళు పైబడ్డ ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మోనోప్లాస్‌ సమయంలో ఈ సమస్య మరి ఎక్కువ. అందుకే కాలుష్యం, జింక్ ఎక్కువగా ఉండే ఈ నల్ల నువ్వులను ఆహారంలో భాగంగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచిది అంటున్నారు పోషక ఆహార నిపుణులు.