NTV Telugu Site icon

Serial Killer : జైలునుంచి వచ్చిన సీరియల్ కిల్లర్.. వణికిపోతున్న గోవా మహిళలు

Serial Killer Of Goa,

Serial Killer Of Goa,

Serial Killer : ఒకప్పుడు గోవాలో సీరియల్  కిల్లర్ అంటే మహిళల్లో విపరీతమైన భయం ఉండేది. గోవా రాష్ట్రానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసేవాడు. ఆ సమయంలో మహిళల్లో భయాందోళనకు కారణమైన మహానంద్ నాయక్ 14 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 21 రోజుల పాటు ఫిరోల్ పై విడుదలయ్యాడు. దీంతో తను అరెస్ట్ కావడానికి కారణమైన బాధిత మహిళ పోలీసుల రక్షణ కోరింది.

మహానంద్ నాయక్ కొల్వాల్ ఫిరోల్ పై శుక్రవారం జైలు నుండి విడుదలయ్యారు. మహానంద నిరుపేద మహిళలపై నిఘా పెట్టి వారితో చనువు పెంచుకునేవాడు. ఆ క్రమంలోనే వారికి పెళ్లికి రప్పించేవాడు. తర్వాత పారిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇంటి నుంచి నగలు, డబ్బులు తీసుకురావాలని మహిళలను అడిగేవాడు. ఇంటి నుంచి బంగారం, డబ్బులతో వచ్చే మహిళలను నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించి ఆభరణాలు తీసుకుని గొంతుకోసి హత్య చేసి పారిపోయేవాడు.

Read Also:Madhya Pradesh: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు

ఫోండాకు చెందిన నిరుపేద మహిళతో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడానికి మహానంద్ కూడా ఆమెను ప్రలోభపెట్టాడు. ఆమెను వివాహం చేసుకోలేదని, తనను మోసం చేశాడని, ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసులో మహానంద్‌ను అరెస్టు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అప్పటి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సి. ఎల్. పాటిల్, డిప్యూటీ సూపరింటెండెంట్ సెరాఫిన్ డయాస్ అతని అకృత్యాల పరంపరను బట్టబయలు చేశారు. ఆ సమయంలో తాను పదహారు మంది మహిళలను ఈ విధంగా మోసం చేసినట్లు అంగీకరించాడు.

రిక్షా డ్రైవర్ నుండి సీరియల్ కిల్లర్
1995-2009 సంవత్సరాల మధ్య మొత్తం 16 నుంచి 18 మంది మహిళలను ఇలాగే హత్య చేసినట్లు వెల్లడైంది. తన ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడినందుకు అరెస్టయ్యాడు. అతను గోవాలోని ఫోండా గ్రామంలో రిక్షా నడుపుతూ ఉండేవాడు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలతో స్నేహం చేసి బంగారం దోచుకునేందుకు వారిని చంపేశానని ఒప్పుకున్నాడు. అతను 20 ఏప్రిల్ 2009న అరెస్టయ్యాడు. వాసంతి గావ్డే (19), సుశీల ఫతార్‌పేకర్ (30), యోగితా నాయక్ (30) హత్య కేసులో అతనికి మూడు జీవిత ఖైదులు, అత్యాచారం కేసులో అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

Read Also:Bengal Panchayat Polls: ముర్షిదాబాద్‌లో బాంబు పేలుడు.. చిన్నారులు బంతి అని ఆడుకుంటుండగా..