Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం
- తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం
- హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవిగుప్తా నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. పంజాబ్‌కు చెందిన జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి డీజీపీ అయ్యారు. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Read Also: IAS: ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్.. మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్
Also Read
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
పంజాబ్‌లోని జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2025 సెప్టెంబరులో పదవీ విరమణ చేస్తారు. తాజా నియామకంతో 14 నెలలపాటు డీజీపీగా జితేందర్ కొనసాగనున్నారు.

తాజావార్తలు
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!