Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!

  • కేకేఆర్ భారీ లక్ష్య ఛేదనలో ఓటమి
  • అంగ్క్రిష్ రఘువంశీ 27 బంతుల్లో 50 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్
  • మ్యాచ్‌ను ముగించడంలో విఫలమయ్యాడని సెహ్వాగ్ వ్యాఖ్య
  • "విరాట్ కోహ్లీని చూసి ఛేజింగ్ నేర్చుకో" అంటూ సూచన
  • చివరి వరకు క్రీజులో ఉంటే జట్టు గెలిచేదని అభిప్రాయం..
Virender Sehwag

Virender Sehwag

Virender Sehwag: ఐపీఎల్ 2026 సీజన్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ అంచనాలకు భిన్నంగా సాగుతోంది. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (50 పరుగులు, 27 బంతుల్లో) అద్భుత అర్ధసెంచరీతో రాణించినప్పటికీ కేకేఆర్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో రఘువంశీ ఆటతీరుపై టీంఇండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

సెహ్వాగ్ రఘువంశీ ఆడిన ఆట తీరును ప్రశంసిస్తూనే, మ్యాచ్‌ ను ముగించడంలో అతను విఫలమయ్యాడని పేర్కొన్నారు. రఘువంశీ చాలా బాగా ఆడాడు, కానీ ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అతను 18 లేదా 20వ ఓవర్ వరకు క్రీజులో ఉండి ఉంటే కేకేఆర్‌ జట్టుకు విజయం దక్కేది. “నీవు విరాట్ కోహ్లీ నుండి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే.. అది రన్ ఛేజింగ్‌ను ఎలా ముగించాలో నేర్చుకో” అని కాస్త ఘాటుగానే చెప్పినట్లుగా అర్థమవుతుంది. చివరి వరకు ఉండి జట్టును గెలిపించినప్పుడే నీవు స్టార్ అవుతావు” అంటూ సెహ్వాగ్ అన్నారు. రింకూ సింగ్‌ తో అవగాహన లేమి వల్ల రఘువంశీ రనౌట్ కావడం కేకేఆర్ పతనానికి దారితీసింది. 120/4 తో ఉన్న జట్టు ఆ తర్వాత కేవలం 41 పరుగులు జోడించి అంటే 161 పరుగులకే కుప్పకూలి ఓటమిని మూటగట్టుకుంది.

Shreyas Iyer Fined: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి చేస్తే మ్యాచ్ సస్పెన్షన్.?

మరోవైపు, మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన స్ట్రైక్ రేట్, ఫామ్ గురించి వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. 2023 నుండి నా స్ట్రైక్ రేట్ అత్యుత్తమంగా ఉంది. నా గురించి మాట్లాడేవారు బహుశా మ్యాచ్‌ లు చూడటం లేదేమో లేదా నాపై ఏదైనా వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారేమో.. నేను ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. నేను సాధించిన విజయాలను చూసి వారు ఈర్ష్య పడుతున్నారు” అని రహానే మండిపడ్డారు. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్, తన నెక్స్ట్ మ్యాచ్‌ ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌ తో జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9న లక్నో సూపర్ జెయింట్స్‌ తో తలపడాల్సి ఉంది. వరుస ఓటములతో ఉన్న కేకేఆర్, ఈ మ్యాచ్‌ లలో గెలిచి మళ్లీ ఫామ్‌ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.