NTV Telugu Site icon

Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!

Seema Haider

Seema Haider

2024 సంవత్సరం మొదటి రోజున సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా, సచిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే శుభవార్త అందిస్తాం’’ అని సీమా హైదర్ అన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమకు ఇది ఐదవ సంతానం. అంతకు ముందు.. ఆమెకు తన మొదటి భర్తతో నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా సీమతో కలిసి ఇండియా వచ్చి గ్రేటర్ నోయిడాలోని సచిన్ ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. సీమ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు తల్లి అవుతానో తెలియదు.. కానీ సచిన్‌కి, తనకు కచ్చితంగా బిడ్డ పుట్టడం ఖాయమని తెలిపింది.

Read Also: Muhammad Yunus: నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌కు 6 నెలల జైలు శిక్ష

కాగా.. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఆన్‌లైన్‌లో PUBG గేమ్ ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. గతేడాది సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ప్రయాణ ఆంక్షల షరతులతో వారిని విడుదల చేశారు. సీమా, సచిన్ ల ప్రేమ వ్యవహారం భారత్, పాకిస్తాన్ మధ్య చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఈ విషయంపై ఆసక్తి చూపారు.

Read Also: Tollywood: కొత్త సంవత్సరం.. కొత్త పోస్టర్లపై ఓ లుక్ వేయండి