Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్‌లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో తమ ప్రభుత్వం అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా అన్ని డివిజన్లను డెవలప్ చేసిందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆసుపత్రులు , ఫంక్షన్ హాల్స్ , ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీలు నిర్మించి సికింద్రాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని పద్మారావు గౌడ్ చెప్పారు.
ఇదే తరహాలో సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారాయన. తన క్యాంపు కార్యాలయం ద్వారా ఎవరు ఎప్పుడు ఏ సమస్యతో వచ్చిన వెంటనే పరిష్కరించి .. సమస్య లేకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించారు.. ఇప్పుడు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో మన గళం వినిపించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కొట్లాడుతానని అన్నారు సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్. తనకు అంతా ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
