Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
Read Also:R.Krishnaiah : కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు
ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు? లాంటి అంశాలను చాలా నేచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ అనే పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ గా శివశక్తి పాట అయిన ‘నమో నమః శివాయ’ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Read Also:Wedding: పెళ్లిలో ఇద్దరు కుమార్తెలతో తల్లి డ్యాన్స్.. వీడియో వైరల్
డిసెంబర్ 22న ఈ పాటను కాశీ నగరంలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ ఆ పాట రిలీజ్ వాయిదా వేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సాంగ్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని యూనిట్ ప్రకటించింది. జనవరి 4వ తేదీ సాయంత్రం 5 : 04గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ‘తండేల్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.