NTV Telugu Site icon

Opposition meeting: జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్ష నేతల రెండో సమావేశం.. స్పష్టం చేసిన కాంగ్రెస్..!

Opposition

Opposition

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సన్నాహకానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల సమావేశం రెండోసారి నిర్వహిస్తుంది.

Bandla Ganesh: గురు పూర్ణిమ.. దూరంగా ఉంటా అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్

అంతకుముందు సమావేశానికి సంబంధించి జనతాదళ్ యునైటెడ్ (జెడియు) నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. వచ్చే వారం బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల ముఖ్యమైన సమావేశం వాయిదా పడిందని.. వర్షాకాల సమావేశం తర్వాతకు వాయిదా వేసినట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత.. సమావేశానికి సంబంధించి కొత్త తేదీ నిర్ణయించబడుతుందని తెలిపారు. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా ఈ సమావేశంపై ANIతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల సమావేశం 2 నుంచి 4 రోజులు ఆలస్యం కావచ్చని.. లేదా ముందుగానే నిర్వహించవచ్చు అని తెలిపారు. చాలా మంది నేతలు బిజీగా ఉండటంతో.. ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Anushka: నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు

బీహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే వారం జూలై 10న నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు జూలై 24 వరకు కొనసాగనున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇద్దరూ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటారు. అందువల్ల సమావేశాన్ని వాయిదా వేయాలని నితీష్ కుమార్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం శనివారం మాట్లాడుతూ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమవుతాయని.. ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని చెప్పారు. 23 రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 23 సభలు జరగనున్నాయని పేర్కొన్నారు.