SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు వైపు మళ్లాయి.
IND vs BAN: రాణించిన టీమిండియా బ్యాటర్లు.. బంగ్లా ముందు భారీ టార్గెట్
ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. నేడు ఉదయం షూటింగ్ ప్రారంభమైనట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని మొదటి షెడ్యూల్ లో షూట్ చేస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీత భానీలను స్వరపరుచున్నాడు. సినిమాలో రెజీనా క్యాసాండ్రా, సాయామి ఖేర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు నిర్మాతలు.
Thandel : శ్రీకాకుళం షెడ్యూల్ పూర్తి చేసిన ‘తండేల్’.. ఫొటోస్ వైరల్