Scorpio Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఎనిమిది మంది మృతి
- ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.
- చెరువులోకి దూసుకెళ్లిన స్కార్పియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scorpio Road Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చెరువులో మరో యువకుడు కనిపించకుండా పోగా.. తెల్లవారు జామున అతడి డెడ్ బాడీ స్థానికులు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడికి సహాయక చర్యలు చెప్పట్టారు. శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. మృతుల్లో మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉంది. మహిళా ఉపాధ్యాయురాలు స్కార్పియో బుక్ చేసుకుని సూరజ్‌పూర్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో కారులో మరికొందరు కూడా ఎక్కారు.
Read Also: IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 147
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మార్గమధ్యంలో రాత్రి భోజనం ముగించుకుని సూరజ్‌పూర్‌కు వెళుతుండగా.. రాజ్‌పూర్ సమీపంలోని బుధ బాగీచా సమీపంలో స్కార్పియో అదుపు తప్పి రాంగ్ సైడ్‌లోకి వెళ్లి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని, డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో స్కార్పియో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఈ ప్రమాదం గురించి ప్రజలు వెంటనే రాజ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటన్నర పాటు శ్రమించిన తర్వాత జేసీబీ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. సెన్సార్ కారణంగా తలుపు లాక్ చేయబడింది. దాంతో ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందరూ లోపలే చనిపోయారు. ఘటన సమాచారం అందుకున్న సమరి ఎమ్మెల్యే ఉద్దేశ్వరి పైక్రా కూడా రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. అతి వేగం, డ్రైవర్ మద్యం సేవించడం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.
Read Also: Ishan Kishan Ball Tampering: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల విషయంలో అంపైర్‌తో గొడవ పడ్డ ఇషాన్ కిషన్
बलरामपुर
बीती रात बड़ा सड़क हादसा
हाई स्पीड स्कॉर्पियो सड़क किनारे खदान में गिरी
8 लोगों की मौत, मृतकों में 1 महिला 1 बच्ची भी शामिल।
राजपुर-कुसमी रोड में बूढ़ा बगीचा के पास की घटना
स्कॉर्पियो में सवार सभी लोग सूरजपुर हा रहे थे #Balrampur #Accident #Chhattisgarh pic.twitter.com/HQlACaedE6
— Anshuman Sharma (@anshuman_sunona) November 3, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!