Site icon NTV Telugu

SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!

Sco Summit

Sco Summit

SCO Summit: చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్‌ రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్‌లో భాగంగా ముందుగా నేతలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాంజిన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ భారత్, తన ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. ఈ నేపథ్యంలో మోడీ–పుతిన్ భేటీ అత్యంత ప్రాధాన్యంగా మారింది.

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. 9 మంది మృతి.. ఢిల్లీలో కూడా ప్రకంపనలు

రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించిందనే కారణంతో అమెరికా, భారత్‌పై 25 శాతం అదనపు సుంకం (టారిఫ్) విధించింది. ఈ పరిణామం నేపథ్యంలో మోడీ–పుతిన్ భేటీపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న “టారిఫ్ వార్” నిర్ణయం తర్వాత తొలిసారిగా ఈ స్థాయి సమావేశం జరగడం గమనార్హం.

ఈసారి SCO వేదికపై చైనా, రష్యా, భారత్ నేతలు ఒకే వేదిక నుంచి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ముఖ్యంగా చమురు, వాణిజ్యం, భద్రతా అంశాలపై ఒకే తీర్మానం తీసుకునే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. రష్యా నుంచి భారత్, చైనా ఎక్కువగా చమురు దిగుమతి చేస్తుండటంతో అమెరికా ఆంక్షలు తక్కువ ప్రభావం చూపించాయి.

బీచ్ బ్యూటీగా మెరిసిన నేహా శెట్టి.. ఫ్యాన్స్ క్రేజ్ అంత ఇంత కాదు…

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకారం.. ప్రధాని మోడీ ముందుగా SCO ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించి, భారతదేశం ప్రాంతీయ సహకారంపై తీసుకున్న దృక్పథాన్ని వివరించనున్నారు. ఆ తరువాత పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు ముగించుకుని భారత్‌కి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇకపోతే, భారత్ తన విదేశాంగ విధానంలో మార్పు ఉండదని స్పష్టంగా ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఒక పెద్ద గ్లోబల్ సంక్షోభాన్ని భారత్ తప్పించిందని తాజాగా వెలువడిన నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తానికి, SCO వేదికపై మోడీ–పుతిన్ సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Exit mobile version