Site icon NTV Telugu

Scissors In Abdomen: మహిళ కడుపులో కత్తెర.. చూసి షాకైన డాక్టర్లు

Scissors

Scissors

మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్‌లో తేలింది. ఇది చూసిన డాక్టర్లు షాకయ్యారు. ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం గ్వాలియర్‌లోని కమలా రాజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. అయితే.. అప్పటి నుంచి ఆమె కడుపులో నొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పి కోసం ఎన్ని మందులు వాడినప్పటికీ, అవి పని చేయలేదు. ఈ క్రమంలో వైద్యులు సీటీ స్కాన్ చేయాలని సూచించారు.

Ajit Pawar: బీజేపీ నుంచే మహారాష్ట్ర సీఎం.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..

సీటీ స్కాన్ చేసి చూడగా.. రిపోర్టులో ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. వైద్య సిబ్బందితో సహా పలువురు ఆశ్చర్యపోయారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ప్రమాదవశాత్తు ఆమె కడుపులో కత్తెరను వదిలేశారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం ప్రకారం.. సౌంధ గోహద్‌లో నివసించే 44 ఏళ్ల కమలా బాయి రెండేళ్ల క్రితం కమల రాజా హాస్పిటల్‌లో కడుపు ఆపరేషన్ చేయించుకుంది. అప్పటి నుండి ఆమె తన కడుపులో తీవ్రమైన నొప్పి గురించి చెబుతూ ఉండేది.. తాజాగా సీటీ స్కాన్ చూస్తే కడుపులో కత్తెర ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

Metro Viral Video : బట్టల్లేకుండా టవల్స్ ధరించి.. మెట్రోలో హల్‌చల్ చేసిన నలుగురు అమ్మాయిలు (వీడియో)

కడుపులో ఇనుప వస్తువు కనిపించిందని, అది కత్తెరగా తేలిందని డాక్టర్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కమలా బాయి కుటుంబీకులు డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కమల బాయికి ఇంత నొప్పి వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని జిల్లా ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Exit mobile version