Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahilyanagar: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో నేడు ఉదయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. రాహురి ప్రాంతంలోని కొంధవాడ్ గ్రామం సమీపంలో విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం అనంతరం బస్సులో చిక్కుకున్న విద్యార్థులను స్థానికుల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రోడ్డు పక్కన బస్సు పూర్తిగా ఒరిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!