Home Loan Comparison : సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కాగా, పట్టణాల్లో సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వారిలో దాదాపు 90శాతం బ్యాంకులనుంచి రుణాలు తీసుకుంటారు. కరోనా కాలంలో రెపో రేటు తగ్గింపు కారణంగా గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించాయి బ్యాంకులు. అయితే.. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నిమ్మదించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్బీఐ సహా అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు రెపో వడ్డీ రేటును నిరంతరం పెంచుతున్నాయి.
కాబట్టి గృహ రుణంతో సహా రుణ పథకాలపై వడ్డీ రేటు పెరుగుతోంది. కాబట్టి SBI vs PNB vs HDFC vs బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు హోం లోన్స్ ఇస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం.
Read Also: INDWvsENGW: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లాండ్ బ్యాటింగ్
బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా గత నెలలో గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా 8.9% నుంచి 10.5% వడ్డీ రేటుకు హోం లోన్ అందజేస్తుంది. అంటే మీరు నెలవారీ జీతం పొందకపోయినా, వ్యాపారం చేస్తుంటే, కనీసం 8.95 శాతం నుంచి 10.6 శాతం మధ్య గృహ రుణం లభిస్తుంది.
హెడ్డీఎఫ్సీ
రెపో రేటును పెంచడానికి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశానికి ఒక రోజు ముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణ పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. 30 లక్షల వరకు గృహ రుణాలకు 9% నుండి 9.50% వడ్డీ రేటు. మహిళలకు 8.95 శాతం నుంచి 9.45 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందజేస్తుంది. 30 నుంచి 75 లక్షల రూపాయల మధ్య రుణం తీసుకుంటే వడ్డీ రేటు 9.25 శాతం నుంచి 9.75 శాతం. మహిళలకు 9.20 శాతం నుంచి 9.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి.
Read Also: Uttam Kumar Reddy : ఉమ్మడి మేళ్లచెరువు మండలాన్ని డెవలప్ చేసిన ఘనత నాదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్‌బీఐ రెపో రేటు పెంపుతో పాటు రుణ పథకాలపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ఎస్‌బీఐగా పిలిచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మీ CIBIL స్కోర్ 700 నుండి 749 పాయింట్లు ఉంటే 8.95 శాతం వడ్డీ. ఇది 550 మరియు 649 పాయింట్ల మధ్య ఉంటే, గృహ రుణం 9.65 శాతం వద్ద అందించబడుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.80 శాతం నుంచి 9.35 శాతం వడ్డీ రేటుతో రూ. 30 లక్షల వరకు గృహ రుణాన్ని అందిస్తోంది.