Site icon NTV Telugu

Electoral bonds: ఆ రహస్యాలు బయటపెట్టం.. తేల్చిచెప్పిన ఎస్‌బీఐ

Sbi

Sbi

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అనంతరం ఈసీ వెబ్‌సైట్‌లో పొందిపరిచింది. అయితే తాజాగా ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వివరాలను మాత్రం బయటపెట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Aryan Khan: సాయి ధరమ్ తేజ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమలో షారుఖ్ ఖాన్ కొడుకు?

ఎన్నికల బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్‌ కోసం తమ అధీకృత బ్రాంచీలకు ఎస్‌బీఐ జారీ చేసిన ఎస్‌వోపీ వివరాలను చెప్పాలంటూ హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్‌ సమాచర హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అయితే దీనికి ఎస్‌బీఐ సమాధానమిస్తూ… అది తమ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని.. వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నాయని స్టేట్ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ఘోరం.. ఇద్దరు బాలికలు సజీవదహనం

స్టేట్ బ్యాంక్ ఇచ్చిన సమాచారంపై అంజలి భరద్వాజ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. వాటికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాలని ఆదేశించిందన్నారు. అయినప్పటికీ ఎస్‌బీఐ కీలక సమాచారాన్ని పంచుకునేందుకు నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఎస్‌వోపీ బయటపెడతేనే ఎన్నికల బాండ్ల విక్రయం, ఎన్‌క్యాష్‌పై బ్యాంకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందన్న వివరాలు బయటికొస్తాయని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: JK Cement: అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా XUV 700, స్కార్పియోలను గిఫ్టుగా ఇచ్చి జేకే సిమెంట్..

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల సమగ్ర వివరాలను ఈసీకి అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఎట్టకేలకు మార్చి 21న సమర్పించింది. అనంతరం వాటిని కేంద్ర ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఎస్‌వోపీని మాత్రం బయటపెట్టేందుకు మాత్రం ఎస్‌బీఐ సుముఖంగా లేదు.

ఇది కూడా చదవండి: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..

Exit mobile version