Saudi Arabia: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఓ ముస్లిం దేశం పచ్చజెండా ఊపింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ ముస్లిం దేశం తన సైన్యాన్ని బలోపేతం చేయడనికి ప్లాన్ చేస్తుంది. సౌదీ అరేబియా సైన్యంలో కొత్తగా యువకులు, మహిళలను నియమిస్తోంది. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పురుషులు, మహిళలిద్దరికీ కొత్త సైనిక నియామక ప్రక్రియను డిసెంబర్ 7న నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన సిబ్బందితో జాతీయ దళాలను బలోపేతం చేయడమే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
READ ALSO: Vijay Deverakonda: విజయ్ అభిమానులకు షాక్.. ‘కింగ్‌డమ్’ సీక్వెల్‌పై సస్పెన్స్
దేశ అధికారిక జాయింట్ మిలిటరీ రిక్రూట్‌మెంట్ కమాండ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే ఈ నియామకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నియామక ప్రక్రియ దాని సమగ్రతకు ప్రత్యేకమైనది, విస్తృత శ్రేణి అర్హతలు, ర్యాంకులను కలిగి ఉంది. అందుబాటులో ఉన్న స్థానాలు, విభిన్న విద్యా నేపథ్యాలకు అనుగుణంగా సైన్యంలో నియామకాలను రూపొందించారు. అన్ని రంగాల నుంచి ప్రతిభావంతులకు సైన్యంలో చోటు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించారు. అందుబాటులో ఉన్న సైనిక ర్యాంకులు ప్రారంభ స్థాయి నుంచి నాన్-కమిషన్డ్ ఆఫీసర్ పాత్రల వరకు ఉన్నాయి. సైనికుడు, మొదటి సైనికుడు, కార్పోరల్, వైస్ సార్జెంట్, సార్జెంట్ స్థాయి వరకు పోస్ట్‌లకు సౌదీ రిక్రూట్ చేసుకోనుంది.
రక్షణ మంత్రిత్వ శాఖ మూడు ప్రధాన విద్యా స్థాయిల నుంచి నియామకాల కోసం దరఖాస్తుదారులను కోరుతోంది. బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్లు, డిప్లొమా హోల్డర్లు, జనరల్ సెకండరీ స్కూల్ (హై స్కూల్). స్పెషలైజేషన్ల పరిధి చాలా విస్తృతమైనది 100 కంటే ఎక్కువ రంగాలను కవర్ చేస్తుంది. అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు (గరిష్టంగా 40 సంవత్సరాలు మించకూడదు). అలాగే దరఖాస్తుదారు కచ్చితంగా సౌదీ పౌరుడు అయి ఉండాలని, సైనిక సేవకు శారీరకంగా, వైద్యపరంగా దృఢంగా ఉండాలని, ప్రస్తుతం ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఉద్యోగం చేయకూడదని, అలాగే గతంలో ఏ సైనిక లేదా ప్రభుత్వ రంగం నుంచి తొలగిపునకు గురికాకుండా ఉండాలని పేర్కొంది.
READ ALSO: Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా!