MLA Adimulam: తన నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ ఎక్కువైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. సత్యవేడు నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవహారం పెరిగిపోయిందని, తాను ఎమ్మెల్యేగా ఉన్నా తనకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై మండిపడ్డ ఆయన, త్వరలోనే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
Read Also: Siddaramaiah: అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించాం.. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సిద్ధరామయ్య క్లారిటీ
నియంత్రణ ధోరణి నాకిష్టం లేదు.. అందుకే పెద్దిరెడ్డిని ఎదిరించాను.. ఇప్పుడు మరొక రెడ్డిని తెచ్చి నామీద పెట్టాలా? అంటూ అదిమూలం అసహనం వ్యక్తం చేశారు. తనను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. చిన్నచిన్న విషయాలు సీఎం చంద్రబాబుకు కూడా తెలియడం లేదు..? ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎం వద్ద వివరంగా చెబుతాను అన్నారు. ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని ఆదిమూలం అన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఎలా పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడు? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు.. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు?” అని ప్రశ్నించారు.
Read Also: Janhvi Kapoor: నా తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేశారు – జాన్వీ కపూర్
అసలు, ప్రజా దర్బార్ నేను పెడితే.. నువ్వు ఎలా పెడుతావు? అని మండిపడ్డారు ఆదిమూలం.. తన స్థానంలో పార్టీ కోఆర్డినేటర్ వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ పెట్టేది నేను. ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించారు.. సురుటుపల్లి ఆలయంలోనూ నాకు గౌరవం ఇవ్వలేదు.. సురుటుపల్లి చైర్మన్‌గా ఒక బియ్యం దొంగని నియమించారు అని ఆరోపించారు. ఈ నియామకంపై కూడా త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చెరువు కోట్టిన ప్రాంతాల్లో ప్రజలకు ఆశించినంత సహాయం అందలేదని, ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
