Site icon NTV Telugu

Satyavathi Rathod: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కవితపై ఈడీ దాడులు..

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్ట్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.. ఇన్ని రోజులు లేనిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్టులు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..

రాజకీయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి.. నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ నాయకులు ఈ పిట్ట బెదిరింపులకు భయపడరని తెలిపారు. దీనిపై ప్రజాక్షేత్రంలో, రాజకీయంగానే ఎదుర్కొంటాం.. చట్టపరంగా న్యాయస్థానాల్లో పోరాడుతామని చెప్పారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 3 గంటలకు పైగా సోదాలు జరిపిన అనంతరం కవితను అరెస్ట్‌ చేసింది ఈడీ. మరోవైపు ఈడీ సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

Samajwadi Party: యూపీలో 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ

Exit mobile version