పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. సుప్రీంలో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందనీ.. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరిందన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ల కేసు సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో వివరించింది కేంద్రం. అయితే.. దీనిపై తాజాగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గిరిజనులకు అన్యాయం చేసిందన్నారు.
Also Read : Damodar Raja Narasimha : కాంగ్రెస్‌కు కోవర్ట్ రోగం పట్టింది
గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచాలని కేసిఆర్ ఆలోచన చేశారని, సెప్టెంబర్ 17న గిరిజన బంజారా భవన్లు ప్రారంభించి 10 శాతం పెంచుతామని సీఎం కేసిఆర్ సభలో ప్రకటన చేశారన్నారు. సుప్రీం కోర్టులో కేసు ఉందని, కేంద్ర మంత్రి అర్జున్ ముండా పార్లమెంట్ లో ప్రకటన చేశారని, 9వ షెడ్యూల్ లో పెట్టి రాష్ట్రపతి చేత ఆమోదం తెలపాలని చెప్పినా కేంద్రము నుంచి స్పందన లేదని ఆమె మండిపడ్డారు. ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్దం అని క్షమాపణ చెప్తారా? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రం గిరిజన రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతేత బీజేపీ నేతలను తెలంగాణలో తిరగనివ్వరని ఆమె ధ్వజమెత్తారు. కచ్చితంగా అడ్డుకుంటామని, గిరిజన రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీయం బాపు రావు వైఖరీ ఏంటో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్లు వేయించుకోవడానికి గిరిజనులను చూస్తున్నారు తప్ప పట్టించు కోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
