సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్ర ల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3 న అనగా ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యం లో ఈ సినిమా లో కీలక పాత్ర పోషించిన సత్యం రాజేష్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.ఈ సినిమా లో తాను ఓ సీన్ లో నగ్నం గా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు… పొలిమేర 1 కంటే కూడా ఎక్కువ బడ్జెట్, మరింత ఆసక్తికమైన స్టోరీతో పొలిమేర 2 రానున్నట్లు సత్యం రాజేష్ తెలిపారు.మా ఊరి పొలిమేర 2 మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజై ప్రేక్షకులను భయపెట్టింది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి థ్రిల్ లభిస్తుందని సత్యం రాజేష్ తెలిపారు..
ఇందులో తన పాత్ర కోసం తాను ఏ సినిమాలూ చూడలేదని, సీక్వెల్లో తన పాత్ర మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఆయన తెలిపాడు. ఇందులో ఒక సీన్ లో తాను నగ్నంగా నటించానని, ఆ సీన్ కు అది అవసరం అని తాను భావించినట్లు చెప్పారు.తన 20 ఏళ్ల కెరీర్లో పొలిమేర 2 మూవీ ఎంతో ప్రత్యేకమైనదని, ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం వుంది అని చెప్పుకొచ్చారు.. పొలిమేర 1 కంటే పొలిమేర 2 బడ్జెట్ చాలా ఎక్కువని కూడా సత్యం రాజేష్ చెప్పారు.. ఇక పొలిమేర 2 మూవీ.. ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం ఇబ్బందే అని కూడా తెలిపాడరు.. ఇందులోని హింసాత్మక మరియు భయపెట్టే సీన్లు ఫ్యామిలీ ఆడియెన్స్ అస్సలు చూడలేరని ఆయన అన్నారు.అయితే పొలిమేర 1తో పోలిస్తే.. ఇందులో మరీ అంత ఎక్కువగా అడల్ట్ కంటెంట్ లేదని ఆయన స్పష్టం చేశాడు. పొలిమేర 3 కూడా రావడం ఖాయమని,ఆ మూవీ పొలిమేర 1కి ప్రీక్వెల్ గా రానున్నట్లు తెలిపారు… దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సత్యం రాజేష్ తెలిపారు