NTV Telugu Site icon

Satya Dev Full Bottle : చేతిలో గ్లాసు.. వెనుక మందుబాటిల్.. సత్యదేవ్ వెరైటీలుక్.. ఫన్ గ్యారెంటీ

Satya Dev

Satya Dev

Satya Dev Full Bottle : పాత్ర ఏదైనా అందులో జీవించి పోయే మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. భిన్న పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా చేసినా.. విలన్ గా మెప్పించినా అది ఆయనకే సొంతం. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో ఒకటి ఫుల్ బాటిల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌ మెర్క్యూరి సూరిగా కనిపించనున్నారు. ఈయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఎస్‌డీ కంపెనీ, శర్వంత్రమ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Read Also: Tirumala : తిరుమలలో కారు కలకలం.. పోలీసులు ఛేజింగ్.. కారు వదిలి లోయలో దూకిన యువకులు

డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో శరణ్ కొప్పిశెట్టి ఈ ఫుల్ బాటిల్ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలయిన మూవీ పోస్టర్ అందరినీ మెప్పించింది. పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో సత్యదేవ్‌ను చూస్తుంటే.. పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కాకినాడ పరిసర ప్రాంతాలు, ఆటో, సత్యదేవ్ కళ్లజోడు ఇవన్నీ చూస్తుంటే ఫుల్ ఫన్ గ్యారెంటీ అనిపిస్తోంది. మెర్క్యూరీ సూరి పాత్రలో సత్య దేవ్ అందరినీ అలరించనున్నాడు.