NTV Telugu Site icon

Minister Satya Kumar: వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్.

Satya Kumar

Satya Kumar

Minister Satya Kumar: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిమ్స్ తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిమ్స్‌లో అందించే సేవలపై అధ్యయనం చేసి తదుపరి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ నివారణ, సహా మత్తు బానిసైన వారి కోసం డీఎడిక్షన్ సెంటర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: Nara Lokesh: రెండో రోజూ మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.. సమస్యలు విన్నవించిన ప్రజలు

గత ప్రభుత్వం వైద్యంపై ఆర్బాటం ఆరాటం తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు. వైద్యం కోసం కేంద్రం నుంచి వచ్చిన 60 నిధులనూ గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. వైద్య రంగాన్ని రాష్ట్రం తన వంతు వాటా ఇవ్వకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నాడు-నేడు,ఆరోగ్య శ్రీలో అనేక అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ,అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్య శ్రీ పేరిట కొన్ని ఆస్పత్రులకు, దళారులకు ధారాదత్తం చేసిందన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రులకు రూ. 1500 కోట్ల నిధులు ఇవ్వకుండా బకాయి పెట్టారని.. గత ప్రభుత్వం ఆరోగ్యశాఖకే అనారోగ్యం తెచ్చిందని విమర్శలు గుప్పించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో గత ప్రభుత్వం నిబంధనలు పాటించలేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ సరిచేస్తామన్నారు. వైద్యంలో ఏపీని మోడల్‌గా తీర్చిదిద్దేలా పనిచేస్తామన్నారు. చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పని చేసి ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చుతామన్నారు. శాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఉద్యోగులంతా పని చేయాలని సూచించారు. ఉన్నతాధికారులు ,సిబ్బంది కలసికట్టుగా పారదర్శకంగా , జవాబుదారీగా పని చేయాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైనా వివిధ కీలక శాఖల పైనా ప్రతి అంశపైనా శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.