NTV Telugu Site icon

TG News: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి.. మంత్రులు విజ్ఞప్తి

Samme

Samme

గత 25 రోజులుగా సర్వ శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ అధికారులు చర్చలు నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్ శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులు కోరారు. సమ్మె చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, కేజీబీవీ పాఠశాలల్లో బడగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని, విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని సర్వ శిక్షా ఉద్యోగులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క విజ్ఞప్తి చేశారు.

Read Also: Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి

ఈ క్రమంలో సర్వ శిక్షా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని.. తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని తెలిపారు. అయితే.. సర్వ శిక్షా కస్తూర్బా గాంధీ పాఠశాలు కేంద్రం పరిధిలో 60 శాతం, రాష్ట్రం పరిధిలో 40 శాతం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. సర్వ శిక్షా ఉద్యోగుల సమస్య తెలంగాణలోనే లేదని.. దేశ వ్యాప్తంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోరితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని మంత్రి పొన్నం వెల్లడించారు.

Read Also: Tummala Nageswara Rao: రేవంత్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం..

25 రోజులుగా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని.. తక్షణమే సమ్మె విరమించి ఉద్యోగులు విధుల్లో చేరాలని మంత్రులు కోరారు. సమ్మె విరమిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీతో సమావేశానికి పిలుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నాన్ ఫైనాన్సియల్ డిమాండ్స్‌లో మహిళా ఉద్యోగులకు మెటర్నరి లీవ్స్, సీఎల్‌లు తదితర వాటిపై సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పరిష్కరమయ్యేలా ప్రభుత్వం చూస్తుందని.. ఆర్థికపరమైన డిమాండ్స్ పై సబ్ కమిటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు.

Show comments