NTV Telugu Site icon

Kurnool Crime: ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు అత్యాచారయత్నం

Physical Harassment

Physical Harassment

Kurnool Crime: కర్నూలు జిల్లా కోసిగి మండలం కడదొడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు అత్యాచార యత్నం చేశారు. బాలిక తాత కేకలు వేయడంతో సర్పంచ్ హుసేని అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక 8వ తరగతి చదువుతోంది. బతుకు దెరువు కోసం కూతురును బంధువుల దగ్గర వదిలి తల్లిదండ్రులు కర్ణాటకకు వలస వెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Physical Harassment: మైనర్ బాలికపై అత్యాచారం

Show comments