Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా
- సచిన్ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు ప్రయోజకులై పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తమ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే తరహాలో సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. సారా టెండూల్కర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కూతురు సారా కొత్త ప్రయాణంతో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
సారా టెండూల్కర్ ముంబైలో తన సొంత పైలేట్స్ స్టూడియోను ప్రారంభించినట్లు మాస్టర్ బ్లాస్టర్ శుక్రవారం ప్రకటించారు. తన కుమార్తె కృషి, నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. సారా టెండూల్కర్ కొత్త ఉద్యోగం తనకు అత్యంత ఇష్టమైనదని కూడా ఆయన వెల్లడించారు. ఆమె తన కలను నిజం చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.
సారా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అనేక చిత్రాలను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సారాతో పాటు ఆమె తండ్రి సచిన్ టెండూల్కర్, తల్లి అంజలి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారాతో పాటు ఆమె కాబోయే వదిన సానియా చందోక్ కూడా కనిపించారు. అందరితో కలిసి సారా తన పైలేట్స్ స్టూడియో రిబ్బన్‌ను కత్తిరించారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సారా సోదరుడు అర్జున్ ఈ చిత్రాలలో కనిపించ లేదు.
Also Read:Minister Nara Lokesh: నైపుణ్యం పోర్టల్‌పై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఒక తల్లిదండ్రులుగా మీరు ఎల్లప్పుడూ మీ పిల్లలు నిజంగా ఇష్టపడే పని చేయాలని కోరుకుంటారు. సారా పైలేట్స్ స్టూడియోను తెరవడం చూడటం మా హృదయాలను ఆనందంతో నింపే క్షణాలలో ఒకటి. తను కష్టపడి, విశ్వాసంతో, ఒకొక్క ఇటుకలా ఈ ప్రయాణాన్ని సారా నిర్మించుకుంది. న్యూట్రిషన్, శారీరక కదలిక మా జీవితాలలో ఎప్పుడూ ముఖ్యమైనవే. ఇప్పుడు సారా అదే ఆలోచనను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తుండటం ఎంతో ప్రత్యేకంగా ఉంది. నీవు ప్రారంభించబోయే ఈ ప్రయాణానికి మా హృదయపూర్వక అభినందనలు అంటూ రాసుకొచ్చారు.
As a parent, you always hope your children find something they truly love doing. Watching Sara open a Pilates studio has been one of those moments that fills our hearts.
She has built this journey with her own hard work and belief, brick by brick.
Nutrition and movement have… pic.twitter.com/lpRYj6mXer
— Sachin Tendulkar (@sachin_rt) August 22, 2025
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!