Site icon NTV Telugu

Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్

Sara Tendulka

Sara Tendulka

పిల్లలు ప్రయోజకులై పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తమ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే తరహాలో సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. సారా టెండూల్కర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కూతురు సారా కొత్త ప్రయాణంతో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Also Read:Punjab and Sind Bank Recruitment 2025: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. అర్హులు ఎవరంటే?

సారా టెండూల్కర్ ముంబైలో తన సొంత పైలేట్స్ స్టూడియోను ప్రారంభించినట్లు మాస్టర్ బ్లాస్టర్ శుక్రవారం ప్రకటించారు. తన కుమార్తె కృషి, నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. సారా టెండూల్కర్ కొత్త ఉద్యోగం తనకు అత్యంత ఇష్టమైనదని కూడా ఆయన వెల్లడించారు. ఆమె తన కలను నిజం చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.

సారా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అనేక చిత్రాలను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సారాతో పాటు ఆమె తండ్రి సచిన్ టెండూల్కర్, తల్లి అంజలి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారాతో పాటు ఆమె కాబోయే వదిన సానియా చందోక్ కూడా కనిపించారు. అందరితో కలిసి సారా తన పైలేట్స్ స్టూడియో రిబ్బన్‌ను కత్తిరించారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సారా సోదరుడు అర్జున్ ఈ చిత్రాలలో కనిపించ లేదు.

Also Read:Minister Nara Lokesh: నైపుణ్యం పోర్టల్‌పై లోకేష్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

ఒక తల్లిదండ్రులుగా మీరు ఎల్లప్పుడూ మీ పిల్లలు నిజంగా ఇష్టపడే పని చేయాలని కోరుకుంటారు. సారా పైలేట్స్ స్టూడియోను తెరవడం చూడటం మా హృదయాలను ఆనందంతో నింపే క్షణాలలో ఒకటి. తను కష్టపడి, విశ్వాసంతో, ఒకొక్క ఇటుకలా ఈ ప్రయాణాన్ని సారా నిర్మించుకుంది. న్యూట్రిషన్, శారీరక కదలిక మా జీవితాలలో ఎప్పుడూ ముఖ్యమైనవే. ఇప్పుడు సారా అదే ఆలోచనను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తుండటం ఎంతో ప్రత్యేకంగా ఉంది. నీవు ప్రారంభించబోయే ఈ ప్రయాణానికి మా హృదయపూర్వక అభినందనలు అంటూ రాసుకొచ్చారు.

Exit mobile version