Sara Tendulkar: భారత్ లో ప్రజలకు క్రికెట్ పై ఉన్న పిచ్చి అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క్రికెట్ గాడ్ గా పిలిచుకొనే సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా సచిన్ కుటుంబానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం వార్తలతో సోషల్ మీడియాలో హంగామా రేపిన తర్వాత, ఇప్పుడు సచిన్ కూతురు సారా టెండూల్కర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా గోవాలో ఓ మిస్టరీ మ్యాన్‌తో కలిసి కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీనితో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? అనే చర్చ నెటిజన్లలో ఊపందుకుంది.
అయితే మొత్తానికి ఆ వ్యక్తి గోవాకు చెందిన ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేర్కర్ అని గుర్తించారు. ఆయన గోవాలోని ఓ రెస్టారెంట్ కు కో-ఓనర్ కూడా. తాజాగా సిద్ధార్థ్ టెండూల్కర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఐపీఎల్ మ్యాచ్ లలోనూ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లోనూ సచిన్, అంజలి టెండూల్కర్, సారా టెండూల్కర్‌తో కలిసి సిద్ధార్థ్ పలు సార్లు కనిపించాడు. వాంఖడే స్టేడియంలో తీసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి రిలేషన్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Supreme Court: చెట్లు నరకడం వల్లే ఈ దుస్థితి.. వరదలపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
ఇక సారా పేరు గతంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా లింక్ అయింది. యువరాజ్ సింగ్ నిర్వహించిన చారిటీ డిన్నర్ వంటి కొన్ని కార్యక్రమాల్లో వీరు కలిసి హాజరుకావడంతో, వారి రిలేషన్‌పై రూమర్స్ వచ్చాయి. గిల్ మాత్రం పబ్లిక్‌గా ఆ రూమర్స్‌ను ఖండించాడు. అంతేకాకుండా, సారా టెండూల్కర్ తన వ్యక్తిగత ఫిట్‌నెస్ జర్నీ నుంచి ప్రేరణ పొంది ముంబైలో తన సొంత పిలేట్స్ స్టూడియోను ప్రారంభించింది. లండన్‌లో చదువుతున్న రోజుల్లోనే ఆమెకు పిలేట్స్‌పై ఆసక్తి పెరిగిందని, ఇప్పుడు దాన్ని బిజినెస్‌గా మార్చింది. ఈ స్టార్టప్ గురించి సచిన్ టెండూల్కర్ కూడా పబ్లిక్‌గా ప్రశంసించిన విషయం తెలిసిందే.
అంతేకాదు, ఇటీవల సారా టెండూల్కర్ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తున్న “Come and Say G’Day” అనే అంతర్జాతీయ టూరిజం క్యాంపెయిన్‌కు ఇండియా అంబాసడర్‌గా నియమితులైంది. ఈ గ్లోబల్ క్యాంపెయిన్‌కి 130 మిలియన్ల డాలర్స్ భారీ బడ్జెట్ కేటాయించగా.. ఇండియా, చైనా, జపాన్, యుకే వంటి కీలక మార్కెట్లలో టూరిజం పెంచడం దీని లక్ష్యం. ప్రముఖులు నైజెల్లా లాసన్, రాబర్ట్ ఇర్విన్, థామస్ వెదరాల్ లాంటి వారితో పాటు సారా కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరింది. ముఖ్యంగా యువతను ఆస్ట్రేలియా టూరిజం వైపు ఆకర్షించడానికి సారా కీలక పాత్ర పోషించనుంది.
Nandamuri Balakrishna: నిమ్మకూరు పర్యటనలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు