Site icon NTV Telugu

Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. రంగవల్లులు, డూడూ బసవన్నల విన్యాసాలు..

Sankranthi

Sankranthi

Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో జరపుకునే అతి పెద్ద పండుగగా పేరొందిన సంక్రాంతి పండుగను ప్రజలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఘడియలతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే సంక్రాంతికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

Read Also: Vishwambhara : ‘విశ్వంభర’‌పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు..

పంటలు కోసి ఇంటికి చేరే సమయం కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటల ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రకృతి, వ్యవసాయం, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఈ పండుగ. గ్రామాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పండుగ సందడిని మరింత పెంచేసింది. హరిదాసుల కీర్తనలు, భజనలు గ్రామాల వీధుల్లో మార్మోగుతున్నాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాల్లో మునిగిపోతున్నారు.

Read Also: Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.

ఇక, ఇళ్లల్లో అరిసెలు, సకినాలు, బూరెలు, పాయసం లాంటి సంప్రదాయ పిండి వంటకాలతో ఇళ్లు సువాసనలతో నిండిపోతున్నాయి. పెద్దలు-చిన్నలు అన్న తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడమే సంక్రాంతి పండగ ప్రత్యేకత. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఎన్టీవీ తెలుగు మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Exit mobile version