Sankranthi Fight: ఇంకా సమయం ఉండగానే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం అప్పుడే మొదలైపోయింది. ఈసారి పండగ బరిలో ఏకంగా 7 సినిమాలు నిలుస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే, ఈ పోరులో కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, ‘టికెట్ రేట్ల’ వ్యూహం కూడా కీలకం కాబోతోంది. పెద్ద హీరోలకు పోటీగా యంగ్ హీరోలు మాస్టర్ ప్లాన్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సంక్రాంతి బరిలో 7 సినిమాలు ఉండగా ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు రిలీజ్ డేట్స్ ఇవే. ఈ ఏడాది సంక్రాంతికి 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 2 డబ్బింగ్ చిత్రాలు విడుదలవుతున్నాయి:
జనవరి 9: ప్రభాస్ ‘రాజాసాబ్’
జనవరి 12: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’
జనవరి 13: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
జనవరి 14: నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’
ప్రభాస్, చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాల బడ్జెట్ భారీగా ఉండటంతో, వారు టికెట్ రేట్ల పెంపుపైనే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మూడేళ్లుగా సెట్స్‌పై ఉన్న ‘రాజాసాబ్’ బడ్జెట్ మొదట 150 కోట్లు అనుకున్నా, అది కాస్తా ఇప్పుడు 300 – 400 కోట్లకు చేరిందని టాక్. అలాగే అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కూడా హై బడ్జెట్ చిత్రమే. ఈ పెట్టుబడి తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచడం వారికి అనివార్యం.
Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
అయితే, ఇక్కడే యంగ్ హీరోలు ట్విస్ట్ ఇచ్చారు. శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సహా రవితేజ తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకూడదని, వీలైతే నార్మల్ రేట్ల కంటే తక్కువకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారట. పెద్ద సినిమాల రేట్లు సామాన్యుడికి భారంగా మారితే, తక్కువ ధరలో వినోదాన్ని పంచే చిన్న సినిమాల వైపు ఫ్యామిలీ ఆడియన్స్ మొగ్గు చూపుతారని వీరి ప్లాన్. ఓపెనింగ్స్ కంటే లాంగ్ రన్ మరియు మౌత్ టాక్ ద్వారా కలెక్షన్స్ రాబట్టడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. పండగ పూట సామాన్య ప్రేక్షకుడు ఏ సినిమాను ఎంచుకుంటాడు? భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ కోసమా? లేక జేబుకు చిల్లు పడకుండా నవ్వులు పంచే చిన్న సినిమాల కోసమా? టికెట్ రేట్ల విషయంలో యంగ్ హీరోలు వేసిన ఈ ‘చెక్’ స్టార్ హీరోలకు ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.