ఈ మధ్య కాలంలో సంజూ శాంసన్ టీ20ల్లో అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్‌లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్‌లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే గాక.. ఈ సంవత్సరం టీ20ల్లో 3 సెంచరీలు చేశాడు. దీంతో.. రోహిత్, సూర్యకుమార్, తిలక్ వర్మలను అధిగమించాడు .
కోహ్లీని అధిగమించాడు:
2024లో దక్షిణాఫ్రికాపై 109 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సంజూ 27 ఇన్నింగ్స్‌లలో 967 పరుగులు చేసి కోహ్లీని దాటేశాడు. ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో కోహ్లీ 25 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 921 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ ఐదో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో, యశస్వి జైస్వాల్ ఏడో స్థానంలో, రితురాజ్ గైక్వాడ్ 8వ స్థానంలో ఉన్నారు.
Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
2024లో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్:
967 పరుగులు – సంజు శాంసన్ (27 ఇన్నింగ్స్‌లు)
921 పరుగులు – విరాట్ కోహ్లీ (25 ఇన్నింగ్స్‌లు)
874 పరుగులు – అభిషేక్ శర్మ (31 ఇన్నింగ్స్‌లు)
839 పరుగులు – తిలక్ వర్మ (22 ఇన్నింగ్స్‌లు)
795 పరుగులు – రోహిత్ శర్మ (25 ఇన్నింగ్స్‌లు)
774 పరుగులు – సూర్యకుమార్ యాదవ్ (28 ఇన్నింగ్స్)
728 పరుగులు – యశస్వి జైస్వాల్ (23 ఇన్నింగ్స్)
716 పరుగులు – రుతురాజ్ గైక్వాడ్ (17 ఇన్నింగ్స్)
ఏడాదిలో అత్యధిక సెంచరీలు:
సంజూ శాంసన్ 2024 సంవత్సరంలో ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 3 సెంచరీలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన భారతదేశ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఏడాది వ్యవధిలో టీ20ల్లో 2 సెంచరీలు చేసి అద్భుతాలు చేసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను సంజూ వదిలిపెట్టాడు.
టీ20లో ఏడాదిలో అత్యధిక సెంచరీలు:
3 – సంజు శాంసన్ (2024)
2 – రోహిత్ శర్మ (2018)
2 – సూర్యకుమార్ యాదవ్ (2022)
2 – సూర్యకుమార్ యాదవ్ (2023)
2 – తిలక్ వర్మ (2024)