Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?

  • లక్నో సూపర్ జెయింట్స్ యజమాని..
  • భావోద్వేగానికి లోనైన సంజీవ్ గోయెంకా
  • సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న గోయెంకా
  • ఐపీఎల్ 2026లో లక్నోకు ఇదే తొలి విజయం
  • మ్యాచ్ చివరి ఓవర్లలో టెన్షన్‌తో ప్రార్థనలు చేసిన గోయెంకా..
Sanjiv Goenka Gets Emotional

Sanjiv Goenka Gets Emotional

Sanjiv Goenka Gets Emotional: సంజీవ్ గోయెంకా ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. భారతదేశ బిజినెస్ టైకూన్స్ లో ఒకరైన ఈయన ఐపీఎల్ ద్వారా భారతీయులకు మరింత చేరువయ్యారు. ఈయన సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన జట్టు కెప్టెన్‌ పై లేదా కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్లాస్ పీకుతూ కన్పిస్తూ ఉంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని అయిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో విజయం సాధించిన తర్వాత ఆయన కళ్లు చెమర్చాయి. మైదానంలోనే ఆయన ఆనందంతో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏంది సామి నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!

ఐపీఎల్ 2026 సీజన్‌ లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది తొలి విజయం. తమ మొదటి మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమి పాలైన లక్నోకు, హైదరాబాద్‌పై గెలవడం అత్యవసరంగా మారింది. ఈ గెలుపు జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు ఎంత ప్రాముఖ్యమో ఆయన ప్రవర్తనను బట్టి అర్థమవుతోంది. మ్యాచ్ చివరి ఓవర్లలో జట్టు గెలవాలని ఆయన భక్తితో ప్రార్థిస్తూ కనిపించారు. విజయం ఖాయం కాగానే తన ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండడం కెమెరాలకు చిక్కింది. గోయెంకా లోని ఈ ఎమోషనల్ యాంగిల్ చూసి అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

హైదరాబాద్‌ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలాన్ని పరీక్షిస్తామంటూ వారిని ముందుగా బ్యాటింగ్‌ కు ఆహ్వానించారు. అయితే మహమ్మద్ షమీ నేతృత్వంలోని లక్నో బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 9 వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కెప్టెన్ రిషబ్ పంత్ వెన్నెముకగా నిలిచారు. పంత్ అద్భుతమైన అర్ధసెంచరీ (68 పరుగులు) చేయగా, మరోవైపు ఎయిడెన్ మార్క్రామ్ (45 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మరో ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్నో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో లక్నో 7వ స్థానానికి చేరుకుంది. గతంలో ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేసిన గోయెంకా, ఇప్పుడు టీమ్ గెలుపు కోసం కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే ఈ సీజన్ విజయంపై ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో స్పష్టమవుతోంది.