Site icon NTV Telugu

Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్

Sanjay Dutt

Sanjay Dutt

Sanjay Dutt: ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు గడ్డ పరిస్థితి నెలకొంది. ఎలాంటి కథతో సినిమా వచ్చిన అక్కడి ప్రేక్షకులకు నచ్చట్లేదు. భారీగా ప్లాపును మూటగట్టుకుంటున్నాయి. దానికి తోడు అక్కడ హీరోల, హీరోయిన్స్ నోటి దూల కూడా సినిమా పై బాయ్ కాట్ ఉద్యమాలు జరిగేలా చేస్తున్నాయి. దీనితో బాలీవుడ్ సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతోంది. అంతకు ముందు రికార్డు వసూళ్లు సాధించిన ఖాన్ ల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

Read Also: MicroSoft: మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణ.. చెత్త ఊడ్చే కొత్త యాప్ .. విశేషాలేంటంటే

అదే సమయంలో సౌత్ ఇండియన్ సినిమాలు తమ కంటెంట్ తో బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటున్నాయి. రాజ మౌళి, బహుబలి 1,2, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీరీస్ లు, సుకుమార్ పుష్ప సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. తాజాగా రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన ‘కాంతారా’ కూడా సంచలనం సృష్టిస్తుండటంతో ఇప్పడు ఎక్కడ చూసినా సౌత్ సినిమాలే హాట్ టాపిక్ అవుతున్నాయి.

Read Also: Maoists Arrest: పేలుడు పదార్థాలతో పోలీసులకు చిక్కిన మావోయిస్టులు

ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్ 2’ లో నటించి ఆకట్టుకున్న సంజయ్ తనకు మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని వుందని డైరక్ట్ గా సౌత్ ఇండియన్ దర్శకుల సినిమాల లో నటించాలనే కోరిక గురించి చెప్పాడు.. అలాగే బాలీవుడ్ మేకర్స్ మసాలా, రొడ్డ కొట్టుడు సినిమాలు వదిలి కంటెంట్ వున్న సినిమాల మీద దృష్టి పెట్టాలనే అభిప్రాయం వెలిబుచ్చాడు.

Exit mobile version