Sania Mirza Divorce: కొన్ని నెలల క్రితమే షోయబ్ మాలిక్‌కు సానియా విడాకులు.. అనవసర చర్చలు ఆపేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sania Mirza divorced Shoaib Malik: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (41) మూడో పెళ్లి చేసుకున్నాడు. పాక్ నటి సనా జావెద్ (30)ను షోయబ్ వివాహమాడాడు. పెళ్లి ఫోటోలను షోయబ్ శనివారం స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇరు దేశాల క్రీడా వర్గాల్లో పెద్ద చర్చానీయంశమైంది. అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో షోయబ్ విడాకులు తీసుకున్నాడా? లేదా? అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సానియా కుటుంబం ఆదివారం స్పందించింది. కొన్ని నెలల క్రితమే షోయబ్, సానియా విడాకులు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇక అనవసర చర్చలు ఆపేయండని, సానియా జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుందని పేర్కొంది.
‘సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా గోప్యంగా ఉంచుతుంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో స్పందించక తప్పట్లేదు. షోయబ్, సానియా విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్ కొత్త జీవితం బాగుండాలని విష్ చేసింది. సానియా తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు అండగా నిలవాలి. ఆమె గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలి. అనవసర చర్చలు ఆపేయండి’ అని సానియా కుటుంబం ఓ ప్రకటలో పేర్కొంది.
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గవాస్కర్
సానియా మీర్జా స్వస్థలమైన హైదరాబాద్‌లో ఏప్రిల్ 2010లో షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో వీరి వలీమా జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు 2018లో ఇజాన్ పుట్టాడు. 10 ఏళ్ల పాటు వీరి బంధం బాగానే సాగింది. సానియా, షోయబ్ మధ్య సంబంధాలు చాలా కాలం క్రితమే దెబ్బతిన్నాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సానియా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘పెళ్లి, విడాకులు రెండూ కష్టమే’ అంటూ విడాకులపై హింట్ ఇచ్చింది. చివరకు తమ పన్నెండేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు. కుమారుడు ఇజాన్ ప్రస్తుతం సానియా వద్ద ఉంటున్నాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..