NTV Telugu Site icon

Sandeshkhali Case: ఎన్నికల వేళ షాకింగ్ ట్విస్ట్.. కేసు విత్‌డ్రా

Seve

Seve

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలకు ముందు సందేశ్‌ఖాలీ ఘటన రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనతో రాష్ట్రం అట్టుడికింది. దీనికి బీజేపీ మద్దతు తెల్పడంతో మరింత ఉధృతం అయింది. హైకోర్టు ఆదేశాలతో మొత్తానికి నిందితుడు షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో
ఉంది.

ఇది కూడా చదవండి: AM Ratnam: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరు ఆపలేరు..!

తాజాగా ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కీలక మలుపు తిరిగింది. తమపై అకృత్యాలకు పాల్పడ్డారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తాజాగా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని, బీజేపీ కార్యకర్తలే తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది.

ఇది కూడా చదవండి: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి

బీజేపీ మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు నేతలు, ఇతర కార్యకర్తలు ఇంటికి వచ్చి.. పీఎంఏవైలో పేరును చేర్చుతామంటూ తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారని ఆమె తెలిపింది. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారని చెప్పింది. తానెప్పుడూ రాత్రివేళ ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదని.. తనపై ఎలాంటి అకృత్యాలు జరగలేదని ఆ మహిళ పేర్కొన్నారు. తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి బీజేపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మహిళ ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్‌ఖాలీ బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఒక బాధితురాలికి లోక్‌సభ సీటు కూడా ఇచ్చింది. ఎన్నికలు జరుగుతున్న వేళ సడన్‌గా యూటర్న్ తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Service App Hacked : 108, 102 అంబులెన్స్ సర్వీస్ యాప్ హ్యాక్.. రూ.500ఇచ్చి హాజరు వేయించుకుంటున్న ఉద్యోగులు