పవర్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘యానిమల్ పార్క్’ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జపాన్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సందీప్ వంగా ఈ సీక్వెల్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.
Also Read : Priyanka Chopra : ప్రియాంక కూతురు మాల్తీకి ఏమైంది? ఆ మూడున్నర నెలలు నరకం చూశామన్న నిక్ జోనస్!
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ పోషించిన అజీజ్ పాత్ర కూడా ఒక ‘యానిమల్’ లాంటిదేనని, సెకండ్ పార్ట్‌లో ఇలాంటి యానిమల్ లాంటి క్యారెక్టర్లు ఇంకా చాలా ఉంటాయని సందీప్ చెప్పాడు. అందుకే దీనికి ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయ్యాడు. ముఖ్యంగా ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే పీక్ లెవల్ వార్ ఈ సినిమాలో ఉండబోతోందట. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సందీప్, అది పూర్తయ్యాక 2027లో ఈ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు రణ్‌బీర్ కపూర్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాడట.. ‘సందీప్‌తో మళ్ళీ సెట్‌లోకి వెళ్లడానికి ఆగలేకపోతున్నా. పార్ట్-1 చేస్తున్నప్పుడే దీనికి సంబంధించిన ఐడియాలు మా మధ్య చర్చకు వచ్చాయి’ అని రణ్‌బీర్ చెప్పుకొచ్చాడు. దాదాపు రూ.900 కోట్లు వసూలు చేసిన యానిమల్, ఇప్పుడు జపాన్‌లో ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ సీక్వెల్‌లో మరింత వైలెన్స్, డ్రామా ఉంటుందని మేకర్స్ హింట్ ఇవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
