Sandeep vanga: ఈ మధ్యకాలంలో దర్శకులు ఇతర దర్శకులు చేసే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించడం పరిపాటి అయిపోయింది. అలా ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ స్నేహితులు లేకపోతే తమకు బాగా దగ్గరైన హీరో, హీరోయిన్లు నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నారు. అయితే, అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా మాత్రం రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నటించలేనని చెప్పినట్లు తెలుస్తోంది.
READ ALSO: Fake Babas Gang: దుండిగల్‌లో దొంగ బాబాల ముఠా.. మత్తుమందు చల్లి రూ. 8.5 లక్షలు స్వాహా..!
అసలు విషయం ఏమిటంటే, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉంది. ఆ పాత్ర కోసమే సందీప్ రెడ్డి వంగాను సంప్రదించింది టీమ్. అయితే, అది అతిథి పాత్ర అని చెప్పారు కానీ, అతిథి పాత్ర కన్నా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, తాను ఆ పాత్ర చేయలేనని సందీప్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
సందీప్ రెడ్డి చేయకపోవడంతో, సందీప్‌కి చెప్పిన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా నటించినట్లు తెలుస్తోంది. ఆ విధంగా సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో నటించకపోవడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో *’దసరా’*లో నటించిన నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ధీరజ్ మొగిలినేని ప్రతిష్టాత్మకంగా తన బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
READ ALSO: Justice Surya Kant: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. !