Sandeep reddy vanga : గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్ ని స్పిరిట్ మూవీలో చూస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దుమ్ము రేపే కలెక్షన్స్ తో సలార్ మూవీ దూసుకుపోతుంది. సలార్ ఇచ్చిన జోష్ తో ప్రభాస్ ఇప్పుడు తన తరువాత సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ లైనప్ లో కల్కి 2898 ఏడీ, స్పిరిట్, రాజా డీలక్స్ లాంటి సినిమాలు వున్నాయి.. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇవ్వగా…తాజాగా స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా దీనిపై స్పందించాడు. సినిమాలో ప్రభాస్ పాత్ర, స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ పనుల గురించి అతడు వివరించాడు.స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సందీప్ రెడ్డి వెల్లడించాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని తెలిపాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్ ను ఈ మూవీలో చూడబోతున్నట్లు అతడు చెప్పడం విశేషం.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మరియు యానిమల్ వంటి మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్.. ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడో అనే ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీలో అతనిది పోలీస్ పాత్ర అని చెప్పి సందీప్ ఆసక్తి పెంచుతున్నాడు. స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని, తుది మెరుగులు దిద్దుతున్నట్లు అతడు చెప్పాడు. ప్రీప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు కూడా ప్రభాస్ వెల్లడించాడు. ఈ ఏడాది సెకండాఫ్ లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.స్పిరిట్ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది.ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. రూ.600 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన మూవీగా కల్కి నిలవనుంది. బాహుబలి నుంచి వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్.. మధ్యలో డైరెక్టర్ మారుతితోనూ ఓ సింపుల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా అప్‌డేట్ సంక్రాంతికి రానుంది.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!