Site icon NTV Telugu

Sandeep Kumar Sultania: రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!

Sandeep Kumar Sultania

Sandeep Kumar Sultania

Sandeep Kumar Sultania: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావు కొనసాగుతుండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిటైర్మెంట్‌ అయ్యారు. ఆమె స్థానంలో కె. రామకృష్ణారావు సీఎస్‌గా నియమితులవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానం ఖాళీ అయ్యింది. దీనితో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవిలోకి సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Read Also: Airtel Black: క్రేజీ ఆఫర్.. కేవలం రూ.399లకే IPTV, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, కాలింగ్, 350+ టీవీ ఛానళ్ల ఎంటర్టైన్‌మెంట్..!

నేడు (మే 13) సాయంత్రం లేదా రేపు ఉదయం సందీప్ సుల్తానియా తన కొత్త బాధ్యతలు అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ప్రజాభవన్‌ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. సుల్తానియాను ఆర్థిక శాఖకు నియమించడంపై అధికార వర్గాల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానాల అమలు, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక అనుభవం కలిగిన అధికారిగా ఆయనకు మంచి పేరు ఉంది.

Read Also: Legends Championship: కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత.. బరిలోకి గబ్బర్, రైనా

Exit mobile version