Andhra Pradesh: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కాగా.. ఏపీ నుంచి ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికైన వారికి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Read Also: Allu Arjun: చంచల్ గూడ జైలు లోపలికి అల్లు అర్జున్
బీద మస్తాన్ రావు.. గత ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీ.. వైసీపీ నుంచి జంప్ చేసి 2024 రాష్ట్ర జనరల్ ఎలక్షన్ల సమయానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీద మస్తాన్ రావు ఒక వ్యాపారవేత్త.. అలాగే కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్థానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారినట్లు తెలిసింది. బీద మస్తాన్ రావు 2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. అయితే క్రియాశీలక రాజకీయాలలో లేని బీద మస్తాన్ రావును 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు పంపించారు… 2024లో వైసీపీకి, రాజ్యసభకు కూడా బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. అయితే టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతో టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళడానికి బీదా మస్తాన్ రావు నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ కూడా రాజ్యసభకు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్‌కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
ఆర్.కృష్ణయ్య తెలంగాణా నుంచీ వచ్చినా.. ఆయనను రాజ్యసభకు పంపించింది గత వైసీపీ ప్రభుత్వం … అయితే ఆర్.కృష్ణయ్య మొదటగా బీసీ నాయకుడు.. అలాగే రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి 2014లో పోటీ చేసి గెలిచాడు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.. ఆ తరువాత వైసీపీ ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది.. 2024లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసారు.. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారు. అలాగే బీజేపీ రాబోయే కాలంలో క్షేత్రస్ధాయిలో బలపడాలంటే సామాజికవర్గ సమీకరణాలను పూర్తిగా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దీనిలో బీసీలలో బీజేపీని చొప్పించడానికి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పారు.