NTV Telugu Site icon

Samyuktha Menon: అందమే కాదు మనసు కూడా వెన్నే.. విరూపాక్ష బ్యూటీపై నెటిజన్లు ఫిదా

Samyuktha Menon

Samyuktha Menon

Samyuktha Menon: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ అనే చెప్పాలి. భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆమె నటించిన విరూపాక్ష సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టుతోంది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త ఇద్దరి కెరీర్లో విరూపాక్ష సినిమా ఓ మైలు స్టోన్ గా మిగిలిపోతుంది. ఆమె నటించిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది.

Read Also:Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం

తెలుగుతో పాటు అంతకుముందు మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా విజయాలు రావడంతో ఆమెది గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది. దాంతో దర్శక నిర్మాతల ఫస్ట్ చాయిస్ సంయుక్తనే. సంయుక్త నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం ప్రేక్షకులలో కూడా నెలకొంది. కేవలం అందం అభినయం మాత్రమే కాకుండాతన మనసు కూడా గొప్పదని ఆమె నిరూపించుకుంది. తాజాగా ఆమె చేసిన ఒక గొప్ప పని ప్రేక్షకులలో ఆమె స్థానం మరింత పెరిగింది. విరూపాక్ష మూవీ యూనిట్​తో కలసి ఓంకార్ నిర్వహిస్తున్న సిక్త్ సెన్స్ లో సంయుక్త పాల్గొన్నారు. ఈ షోలో అన్ని టాస్క్​లు గెలిస్తే స్కూటీ ఇస్తానని ఓంకార్ మాట ఇచ్చారు.

Read Also:Viral : ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. డ్యాన్స్ తో అదరగొట్టేశారుగా..

విరూపాక్ష చిత్ర యూనిట్ ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న విద్యార్థుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తామని చెప్పారు. అన్ని టాస్కుల్లోనూ గెలవడంతో ఓం కార్ ఒక స్కూటీని ఇచ్చారు. ఈ స్కూటీని ఎవరికీ ఇస్తారు అని ఓంకార్ అడిగారు.. సంయుక్త నేను సెలెక్ట్ చేస్తానంటూ స్టూడెంట్స్​లో ఇద్దర్ని ఎంపిక చేశారు. సింగల్ పేరెంట్ ఎవరికీ వున్నారు అని మళ్లీ రెండో ప్రశ్న అడగగా ఇద్దరికి లేరు అని తెలిసింది. దీంతో ఆ ఇద్దర్ని స్టేజి పైకి పిలిచి వారిలో ఒకరికి ఆమె స్కూటీ ఇచ్చేశారు. మరో అమ్మాయికి నువ్వేం భయపడకు నేనే నీకు స్కూటీ కొనిస్తాను అంటూ హామీ ఇచ్చింది. దాంతో ఆ విద్యార్థులు సంయుక్తను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు. బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments