కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకేక్కించిన కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే.. అక్కడ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఇక ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీగా తెరకెక్కింది ఇందులోనూ సంయుక్త నటించింది. పలు భాషల్లోని రియాల్టీ షోలలో పాల్గొంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో అర్ద నగ్న వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది..
బిగ్‌బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తన తోటి కంటెస్టెంట్‌ను చెంపపై కొట్టింది. దీంతో ఆమె ప్రవర్తనను అందరూ ఖండించారు..ఇక 2020లో బెంగళూరులోని ఓ పార్క్‌లో తన స్నేహితురాలితో వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఓ మహిళ సంయుక్త ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు ఆ ఇష్యూ వైరల్‌గా మారింది. ఇక గతేడాది మైక్రో బికినీలో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో టాప్‌లెస్ వీడియో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది..
వీడియోకు కింద క్యాప్షన్ గా నీ దేహమే నీ ఆస్తి అంటూ రాసుకొచ్చింది…సంయుక్త ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. తను వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి సామాజిక నిబంధనలు పాటించాల్సిన పని లేదు.. అయితే ఇప్పుడు షేర్ చేసిన వీడియోలో ఈ అమ్మడు మహిళలు ఎప్పుడూ దృఢంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బలం అనేది మగవాళ్లకో లేదంటే అమ్మాయిలకో సంబంధించినది కాదు. మీ శక్తిని పెంచుకోవడానికి ప్రతి రూపం అంటూ చెప్పుకొచ్చింది.. కానీ ఇది మాత్రం వేరే విధంగా వైరల్ అవుతుంది..