NTV Telugu Site icon

Samsung Galaxy S23 Ultra: నెవర్ బిఫోర్ ఆఫర్‌.. లక్షా 50 వేల ఫోన్‌ 49 వేలకే!

Samsung Galaxy S23 Ultra Price Drop

Samsung Galaxy S23 Ultra Price Drop

2024 దీపావళి పండగ సీజన్‌లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్‌ మొబైల్స్‌పై 50 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. ‘శాంసంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్‌ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

శాంసంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.1,49,999గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో గెలాక్సీ S23 అల్ట్రాపై 50 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో రూ.74,999కి మీకు ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వెయ్యి రూపాయల కూపన్ ఉంది. అలానే రూ.25,700 వరకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లో అయితే మీరు ఈ ఫోన్‌ను దాదాపుగా 49 వేలకి కొనుగోలు చేయవచ్చు.

Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌!

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S23పై 52 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. డిస్కౌంట్ అనంతరం రూ.42,998కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌, ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో గెలాక్సీ S24 ఎఫ్ఈని రూ.61,999 కైవసం చేసుకోవచ్చు. గెలాక్సీ S23 ఎఫ్ఈ రూ.32,499కి అందుబాటులో ఉంది. గెలాక్సీ S23 రూ.43,989గా ఉంది. ఈ సేల్‌ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Show comments