Site icon NTV Telugu

Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!

Samsung Galaxy F56 5g

Samsung Galaxy F56 5g

Samsung Galaxy F56 5G: సామ్‌సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F56 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గతంలో విడుదలైన గెలాక్సీ M56 కు అప్డేట్ గా వచ్చింది ఈ మోడల్. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది అత్యధికంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి AMD Xclipse 530 GPU మద్దతుగా ఉంది. ఇది 8GB ర్యామ్ తో 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also: India Pakistan War: భారత్, పాక్‌ ప్రధానులకు విజ్ఞప్తి.. యుద్ధాన్ని ముగించండి..!

ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పై నడుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. ముందుభాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తోంది. ఇది 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 సాంకేతికతను సపోర్ట్ చేస్తుంది. అయితే ఫోన్ బాక్స్‌లో చార్జర్ ఇవ్వలేదు. ఇక భద్రత పరంగా, ఇన్ -డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయంలో USB Type-C ఆడియో, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also: Rohit Sharma: ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండండి.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి..!

గెలాక్సీ F56 5G ఫోన్ గ్రీన్, వయొలెట్ రంగులలో అందుబాటులో ఉంది. ఇక ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999గా నిర్ణయించబడింది. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లతో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో లభ్యమవుతుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా, వినియోగదారులు రెండువేల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా శాంసంగ్ ఫైనాన్స్+, ఇతర ప్రముఖ NBFC భాగస్వాముల ద్వారా ప్రతి నెల 1556 రూపాయలతో మొదలయ్యే EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version