Samsung Galaxy F55 Price: లెదర్ ఫినిష్‌తో శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy F55 5G Launch and Price in India: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తన ఎఫ్ సిరీస్‌లో భాగంగా ఎఫ్55 5జీని ఈ రోజు (మే 27) రిలీజ్ చేసింది. లెదర్ ఫినిష్‌తో ఈ ఫోన్ రావడం గమనార్హం. ఎన్‌ఎఫ్‌సీ, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అయితే ఛార్జర్ ఇవ్వడం లేదు. ఛార్జర్ వేరుగా కొనాల్సి ఉంటుంది. శాంసంగ్ ఎఫ్55 5జీ ఫోన్ ధర, ఇతర వివరాలను ఓసారి చూద్దాం.
Samsung Galaxy F55 5G Price:
శాంసంగ్ ఎఫ్55 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999గా ఉండగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఇక 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచే సేల్స్ ప్రారంభం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.2వేలు డిస్కౌంట్ లభిస్తుంది. లాంచ్ ఆఫర్ కింద మే 31వ లోపు కొనుగోలు చేసే వారికి.. 45W అడాప్టర్‌ను రూ.499కే లభిస్తుంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Samsung Galaxy F55 5G Specs:
శాంసంగ్ ఎఫ్55 5జీలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేని ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ వస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో ఉంటుంది. ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో ఇది వస్తోంది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటాయి.
Also Read: Sitara-Mahesh Babu: మహేష్ బాబు అసలు సీక్రెట్ చెప్పేసిన సితార!
Samsung Galaxy F55 5G Camera and Battery:
ఎఫ్55 5జీలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ ఇచ్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా… 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?