Samsung Galaxy A54 White Colour Launch and Price in India: శాంసంగ్ గెలాక్సీ ఏ50 సిరీస్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు భారీ క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం గెలాక్సీ ఏ54 (Galaxy A54)ను గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో శాంసంగ్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఏ54 ఫోన్‌ను 6 నెలల క్రితం లాంచ్ చేయగా.. ఇప్పుడు కొత్త రంగులో విడుదల చేసింది. శాంసంగ్ కంపెనీ వైట్ కలర్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతంగా, అందంగా ఉంటూ.. అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతోంది.
Samsung Galaxy A54 White Colour Launch:
గెలాక్సీ ఏ54 వైట్ కలర్ ఫోన్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ కలర్‌లో ప్రస్తుతం 256GB స్టోరేజ్ వేరియెంట్ ఉంది. 256GB వేరియంట్ ధర రూ. 38,999గా ఉంది. అయితే శాంసంగ్ ఈ ఫోన్‌ను రూ. 36,999కి అందుబాటులో ఉంచింది. అదనంగా బ్యాంకు, డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. ఈ వైట్ కలర్ ఫోన్‌ను కస్టమర్‌లు కొనాలనుకుంటే.. వెంటనే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
White Colour Specs:
గెలాక్సీ ఏ54 వైట్ కలర్ ఫోన్ 6.4 ఇంచెస్ ఎస్-అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 2400 x 1080 పిక్సెల్ ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ మరియు మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది One UI 5.1-ఆధారిత ఆండ్రాయిడ్ 13పై రాన్ అవుతుంది. ఈ ఫోన్ Exynos 1380 చిప్‌సెట్ ద్వారా 8GB LPDDR4x RAM మరియు UFS 2.2లో 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో రానుంది.
Also Read: World Cup 2023: అతడు మ్యాచ్ విన్నర్.. భారత జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది!
White Colour Camera and Battery:
గెలాక్సీ ఏ54 వైట్ కలర్ ఫోన్‌లో సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇది భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉండగా.. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 రక్షణ ఉంది.