Samsung Galaxy S24: గెలాక్సీ ఎస్24పై భారీ డిస్కౌంట్.. ప్రత్యేక ఆఫర్స్ కూడా!
- గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను లాంచ్
- తగ్గిన ఎస్ 24 ఫోన్ ధరలు
- అందుబాటులో ప్రత్యేక ఆఫర్స్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ ఇటీవల ‘గెలాక్సీ ఎస్ 25’ సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25 ప్లస్ సిరీస్ ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. ఎస్25 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఎస్ 24 ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. బేస్ వేరియంట్‌పై రూ.10 వేల డిస్కౌంట్ ఇస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో ఇప్పటికే తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.
2024 జనవరిలో గెలాక్సీ ఎస్ 24, గెలాక్సీ ఎస్ 24 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను శాంసంగ్ లాంచ్ చేసింది. ఇందులో బేస్ వేరియంట్ ఎస్ 24 ధరల్ని కంపెనీ తగ్గించింది. 8జీబీ128జీబీ వేరియంట్ ధర రూ.74,999 కాగా.. రూ.10వేల డిస్కౌంట్ అనంతరం రూ.64,999కే అందుబాటులో ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.79,999 ఉండగా.. రూ.70,999కే లభించనుంది. 8జీబీ+512జీబీ ధర రూ.89,999 కాగా.. రూ.82,999కే లభిస్తుంది.
Also Read
ప్రత్యేక డిస్కౌంట్లు కూడా శాంసంగ్ కంపెనీ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.10వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్ 24 బేస్ వేరియంట్ (8జీబీ128జీబీ)ను రూ.54,999కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అయితే శాంసంగ్ వెబ్‌సైట్ కంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్ 24 మొబైల్ ధర కాస్త ఎక్కువగా (రూ.66,999) ఉంది. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా ఈ ధర కొంచెం తగ్గనుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!