NTV Telugu Site icon

Samit Dravid: అండర్-19కి ఎంపికయ్యాడు కానీ.. ప్రపంచకప్‌కు ‘అనర్హుడు’ ఎందుకో తెలుసా..?

Sumit

Sumit

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌కు భారత అండర్ 19 జట్టులో అవకాశం లభించింది. సెప్టెంబర్, అక్టోబర్‌లలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ఆడనున్నాడు. కాగా.. కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ కర్ణాటక తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. అతనికి రివార్డ్ లభించింది. అయితే.. భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన సమిత్ ద్రవిడ్, అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడలేడు.

Read Also: Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. షాప్ ఓపెన్ తర్వాత 30 నిమిషాల్లోనే లూటీ.. వీడియో వైరల్..

తదుపరి అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాలో జరగనుంది. ప్రస్తుతం సమిత్ ద్రవిడ్ వయసు 18 ఏళ్లు. ఇతను.. 2005 నవంబర్ 10న జన్మించాడు. అతని 19వ పుట్టినరోజు జరుపుకోవడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే.. 2026లో జరిగే ప్రపంచకప్‌కు బీసీసీఐ అండర్-19 జట్టును ఎంపిక చేసేటప్పుడు, అతడికి 21 ఏళ్లు నిండుతాయి. దీంతో జట్టులో ఎంపికకు అర్హత ఉండదు. ఈ కారణంగా ప్రపంచకప్ ఆడలేడు. ప్రపంచ కప్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో జరిగితే.. 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సులో ప్రపంచ కప్ ఆడవచ్చు.

Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..

సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో ఆడుతున్నాడు. అతను మైసూర్ వారియర్స్ జట్టులో సభ్యుడు. మిడిల్ ఆర్డర్‌లో 114 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌లలో మొత్తం 82 పరుగులు చేశాడు. అతను పేస్ ఆల్ రౌండర్, కానీ అతని ఫాస్ట్ బౌలింగ్ సామర్ధ్యాలు ఉపయోగించడంలేదు. అండర్-19 స్థాయికి నాలుగు రోజుల ఫార్మాట్ దేశీయ టోర్నమెంట్ అయిన కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ఆడాడు. ఈ టోర్నీలో కర్ణాటక తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 362 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టాడు.