Site icon NTV Telugu

West Bengal : మొగుడికి డైవర్స్ ఇచ్చింది మరో మహిళను పెళ్లాడింది

West Bengal

West Bengal

West Bengal : సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే దేశం మనది. పాశ్చాత్య పోకడలకు పోయి దేశ గౌరవాన్ని భంగపరుస్తున్నారు కొందరు. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మనుషులు అలాగే మారుతున్నారు. భారతీయులకు పెళ్లంటే నూరేళ్లపంట. పెళ్లికి మన పూర్వీకులు పురాణాల్లో చాలా ప్రాముఖ్యత కల్పించారు. కొందరి పెళ్లిని అపహాస్యం చేస్తున్నారు. మూడు ముళ్లకు విలువలేకుండా చేస్తున్నారు. అలాంటి పెళ్లే పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇద్దరు మహిళలు స్వలింగ వివాహం చేసుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. దీని కోసం ఒక మహిళ ఏకంగా తన భర్తకు డైవర్స్ కూడా ఇచ్చేసింది.

Read Also:Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..

వివరాల్లోకి వెళితే.. మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మౌసుమి దత్తాకు ఇప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పిల్లలను తన పిల్లలుగా దత్తత తీసుకునేందుకు మౌమిత అంగీకరించింది. దీంతో తన భర్తకు మౌసుమి విడాకులు ఇచ్చేసింది. ఆదివారం వారిద్దరు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా మౌమిత మాట్లాడుతూ… ప్రేమ అనేది స్త్రీ, పురుషుల మధ్యే కాకుండా ఇద్దరు స్త్రీలు, ఇద్దరు మహిళల మధ్య కూడా చిగురిస్తుందని వేదాంతం పలికారు. మౌసుమిని వివాహం చేసుకోవడం తన కుటుంబానికి ఇష్టం లేదని… అందుకే తన ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని చెప్పారు. మౌసుమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మరోవైపు మౌసుమి మాట్లాడుతూ… తన భర్త చిత్రహింసలు తట్టుకోలేకనే అతడి నుంచి విడిపోయానని తెలిపింది.

Read Also:T Shirt: ఈ టీషర్ట్ వేస్తే మీ పిల్లలు నీట్లో మునిగిపోరు.. దీనిపై ముచ్చటపడిన ఆనంద్ మహీంద్ర

Exit mobile version