స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదొక పోస్టుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ గురించి అలాగే వారితో జరిగిన ఫన్ మూమెంట్స్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటుంది.తన కోస్టార్ అయిన విజయ్ దేవరకొండ పిక్ ను షేర్ చేస్తూ అతను తన కష్ట సమయాల్లో తనకు ఎలా సపోర్టివ్గా ఉన్నాడో కూడా చెప్పుకొచ్చింది సమంత.
ఈ క్రమంలోనే తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ మరియు యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఫొటో ను షేర్ చేసింది. ఈ సందర్బంగా ఫొటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ ఫుడ్ ని ఆస్వాదిస్తున్న పిక్ షేర్ చేస్తూ అతని గురించి హార్ట్ ఫెల్ట్ నోట్ ను పంచుకుంది సమంత. మీకు తెలిసిన ఒక మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు మల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తుంటాను అని ఎమోజీస్ యాడ్ చేసింది సమంత.. తను ఫుడీ అయినప్పటికీ కూడా మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు. కానీ ఎంత బాధపడతాడో అంటూ సరదాగా రాసుకొచ్చింది సమంత.. కాగా సమంత చేసిన పోస్ట్ పై రాహుల్ కూడా ఫన్నీగా స్పందించారు. కాగా రాహుల్ రవీంద్రన్ సమంత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికి తెలిసిందే. సమంత బాధలో ఉన్న సమయంలో తనను రాహుల్ రవీంద్రన్ ఎప్పుడూ ఓదారుస్తూ ఉంటాడని పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది సమంత. ఇక రాహుల్ వైఫ్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సమంతకు మంచి ఫ్రెండ్ అని తెలుస్తుంది.