Site icon NTV Telugu

Samantha :బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న సమంత అందాలు..

Samantha New Look

Samantha New Look

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే..ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి… తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ లో ఉన్న డ్రెస్సును వేసుకుంది.. బ్లాక్ కలర్ అనేది హీరోయిన్లకు అందాన్ని పెంచుతుంది..తాజాగా సమంత కూడా బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్ చేస్తుంది. బాడీ షేపులు కనిపించేలా టైట్‌ ఫిట్‌లో స్టన్నింగ్ లుక్ తెగ ఆకట్టుకుంటుంది..

ముంబై లో ఈ అమ్మడు కనిపించింది..వరుణ్‌ దావన్‌తో కలిసి `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఆమె ముంబయికి వెళ్లింది. అక్కడి మిగిలిన షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.. షూటింగ్ టైం తీసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..సమంత ఇటీవల ఏడాది బ్రేక్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె బ్రేక్‌ తీసుకుంటున్నట్టు తెలిపింది. గతంలో సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన విషయం తెలిసింది. దాన్నుంచి కోలుకుని తెలుగులో `ఖుషి` షూటింగ్‌లో పాల్గొంది. అదే సమయంలో `సిటాడెల్‌` షూటింగ్‌లోనూ పాల్గొంది. `ఖుషి` షూటింగ్‌ పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ను పూర్తి చేసే పనిలో ఉంది..

ఈ సిరీస్ తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. కొత్తగా ఆమె దేనికి కమిట్‌ కాలేదని పీఆర్‌ టీమ్‌ తెలిపింది. ఈ లెక్కన ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఉండబోదని తెలుస్తుంది..ప్రస్తుతం తెలుగులో సమంత విజయ్‌ దేవరకొండతో `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న లవ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. సెప్టెంబర్‌ 1న విడుదల కాబోతుంది. అంతకు ముందు సమంత చేసిన `యశోద` యావరేజ్‌గా నిలవగా, `శాకుంతలం` బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.. ఇక ఇప్పటిలో తెలుగు సినిమా లో నటించదని తెలుస్తుంది.. ఇప్పటివరకు ఒక్క సినిమాకు సైన్ చెయ్యలేదు..

Exit mobile version